నర్సాపూర్ మండల కేంద్రంలో సోమవారం, గో రక్షణ సమితి సభ్యులు, బీజేపీ నాయకులు అక్రమంగా గోవులను తరలిస్తున్న కంటైనర్ లారీని అడ్డుకున్నారు. అంబేద్కర్ చౌరస్తా వద్ద గోవులతో లారీ ఉన్నట్లు సమాచారం అందడంతో, నాయకులు నిరసన చేపట్టారు. ఈ సంఘటనతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు లారీని స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు.