చిలిపిచేడ్‌లో సీజ్ చేసిన ఇసుకకు బహిరంగ వేలం

0చూసినవారు
చిలిపిచేడ్‌లో సీజ్ చేసిన ఇసుకకు బహిరంగ వేలం
చిలిపిచేడ్ మండల కేంద్రంలో అక్రమ ఇసుక రవాణాకు పాల్పడిన రెండు ట్రాక్టర్లను ఇటీవల సీజ్ చేయగా, వాటిలోని ఇసుకను గురువారం రెవెన్యూ శాఖ బహిరంగ వేలానికి పెట్టింది. తహశీల్దార్ సహదేవ్, ఎస్ఐ నర్సింలు పర్యవేక్షణలో జరిగిన ఈ వేలంలో ఒక గ్రామస్తుడు రూ. 5,500లకు ఇసుకను దక్కించుకున్నారు. అక్రమ ఇసుక రవాణాను ఉపేక్షించబోమని అధికారులు ఈ సందర్భంగా హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్