వర్షంలో తడిసిన ధాన్యం.. వెల్దుర్తి రైతుల ఆవేదన

0చూసినవారు
వెల్దుర్తి కొనుగోలు కేంద్రంలో నెల రోజుల క్రితం తూకం వేసిన ధాన్యం బస్తాలు ఇంకా తరలించకపోవడంతో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత రాత్రి కురిసిన వర్షానికి ధాన్యం తడిసి నష్టపోతున్నామని రైతు రమేష్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. తడిసిన ధాన్యంతో నాణ్యత దెబ్బతింటే భారీ నష్టం తప్పదని రైతులు చెబుతున్నారు. అధికారులు తడిసిన ధాన్యాన్ని లారీల ద్వారా మిల్లులకు తరలించి ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్