తూప్రాన్ పట్టణ ఐడీఓసీ భవనంలో జరుగుతున్న తూప్రాన్ మండల స్థానిక సంస్థల ఎన్నికలలో రెండవ రోజు సోమవారం 202 నామినేషన్లు వచ్చాయి. ఎంపీడీవో శాలిక తేలు తెలిపిన వివరాల ప్రకారం, సర్పంచ్ పదవులకు 29, వార్డు సభ్యుల పదవులకు 173 నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తం రెండు రోజుల్లో సర్పంచ్, వార్డు సభ్యులకు కలిపి 232 నామినేషన్లు వేశారు.