కౌడిపల్లి గ్రామంలో నిరుపేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని గ్రామ సర్పంచ్ చంద్రం కృష్ణ గౌడ్ అన్నారు. శుక్రవారం గ్రామంలో ఇళ్లు లేని నిరుపేద కుటుంబాలను గుర్తించేందుకు ఇంటింటి సర్వే నిర్వహించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. నిర్మాణ పనులు పూర్తిచేసిన లబ్ధిదారులకు బిల్లులు వేగంగా చెల్లించేలా చర్యలు తీసుకుంటామని సర్పంచ్ తెలిపారు.