16 వార్డుల్లో నామినేషన్ల పరిశీలన… తూప్రాన్‌లో ఎన్నికల వేడి

0చూసినవారు
తూప్రాన్ మున్సిపల్ పరిధిలోని 16 వార్డులకు సంబంధించిన నామినేషన్లను రిటర్నింగ్ అధికారులు నిబంధనల ప్రకారం పరిశీలించారు. ఈ స్క్రూటినీ కార్యక్రమంలో పోటీ అభ్యర్థులు, వారి ప్రతిపాదకులను ఆహ్వానించి పారదర్శకంగా ప్రక్రియను నిర్వహించారు. తూప్రాన్ ఆర్డిఓ జయచంద్ర రెడ్డి ఈ ప్రక్రియను ప్రత్యక్షంగా పర్యవేక్షించి, ఎన్నికల నిబంధనలను కచ్చితంగా పాటించాలని అధికారులకు సూచించారు. ఈ పరిశీలన ప్రక్రియ పూర్తి కావడంతో ఎన్నికల వేడి రాజుకుంది.

ట్యాగ్స్ :