రామాయంపేట మున్సిపాలిటీ 9వ వార్డు దుర్గమ్మ దేవాలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రతిరోజూ అమ్మవారికి విశేష పూజలు, అర్చనలు నిర్వహిస్తున్నారు. ఈరోజు అమ్మవారి సన్నిధిలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారికి పూజలు చేశారు. అనంతరం అందరూ ప్రసాదాన్ని స్వీకరించాలని కోరారు.