హత్నూర పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ పరిసరాలు, రికార్డులు, సిబ్బంది బ్యారెక్స్‌ను పరిశీలించి పరిశుభ్రత, క్రమశిక్షణపై సూచనలు చేశారు. కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలని, రికార్డులను ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేయాలని ఆదేశించారు. సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించడంతో పాటు ఫిర్యాదుదారులతో మర్యాదగా వ్యవహరించాలని సిబ్బందికి సూచించారు.