మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం అచ్చంపేట గ్రామంలో మండల బిజెపి పార్టీ అధ్యక్షులు నీలినగేష్ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని శుభ్రం చేసి స్వచ్ఛభారత్ కార్యక్రమం మెదక్ జిల్లా బిజెపి పార్టీ అధ్యక్షులు వాల్దా రాధామల్లేష్ గౌడ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు నారాయణ రెడ్డి, దళిత మోర్చ నాయకులు అంజి, అచ్చంపేట గ్రామస్తులు, బిజెపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.