పెద్దమ్మ తాండ వాసులు రహదారి దుస్థితి..

0చూసినవారు
పెద్దమ్మ తాండ వాసులు రహదారి దుస్థితి..
నర్సాపూర్ మండలంలోని పెద్దమ్మ తాండ నుంచి నర్సాపూర్‌కు వెళ్లే ప్రధాన రహదారిపై కంకర తేలిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలకు రోడ్డు మరింత దెబ్బతిని గుంతలు ఏర్పడటంతో ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. విద్యార్థులు, రైతులు, గ్రామస్తులు నిత్యం అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి రహదారికి మరమ్మతులు చేపట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు. ఈ సమస్యపై వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్