బీవీఆర్‌ఐటీలో మెకానికల్ బాజా 2026 వేడుకగా మూడో రోజు

బి.వి. రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, నర్సాపూర్‌లో జరుగుతున్న “మెకానికల్ బాజా సే ఇండియా 2026” మూడో రోజున స్టాటిక్, డైనమిక్ ఈవెంట్స్ ఉత్సాహంగా జరిగాయి. మొత్తం 42 వాహనాలు టెక్నికల్ ఇన్స్పెక్షన్ పూర్తి చేసుకోగా, వాటిలో 35 బగ్గీలు బ్రేక్ టెస్ట్‌లో ఉత్తీర్ణత సాధించి ఫైనల్ ఎండ్యూరెన్స్‌కు అర్హత పొందాయి. ఈ సందర్భంగా అనుభవాధారిత విద్యపై ఒక ప్యానల్ చర్చ కూడా జరిగింది. ఆదివారం ఉదయం 8:30 గంటలకు ఫైనల్ రేస్ ప్రారంభమై, అనంతరం విజేతలకు బహుమతులు ప్రదానం చేయబడతాయి.
