తూప్రాన్‌లోని ఐడిఓసి భవనంలో మంగళవారం స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ ప్రక్రియను డీఎస్పీ నరేందర్ గౌడ్ పరిశీలించారు. నామినేషన్ల సమయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా, శాంతి భద్రతలు కచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అన్ని కౌంటర్లను పరిశీలించి సిబ్బందికి తగు సూచనలు చేశారు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, సాఫీగా కొనసాగేందుకు పోలీసులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.