రామాజిపల్లి హైవేపై విషాదం, లారీ ఢీకొని బైక్‌ రైడర్ మృతి

0చూసినవారు
రామాజిపల్లి హైవేపై విషాదం, లారీ ఢీకొని బైక్‌ రైడర్ మృతి
శుక్రవారం మనోహరాబాద్ మండలం రామాజిపల్లి సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో పుల్లం సతీష్ (36) అనే వ్యక్తి మృతి చెందాడు. బైక్‌పై అతివేగంగా వెళ్తున్న సతీష్, లారీని ఢీకొనడంతో అక్కడికక్కడే మరణించాడు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం కనగల్ గ్రామానికి చెందిన సతీష్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్