మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం కుషన్‌గడ్డ తండాలో ఇళ్ల మధ్య ఏర్పాటు చేసిన ప్రమాదకరమైన ట్రాన్స్‌ఫార్మర్ కారణంగా నాలుగు మేకలు విద్యుత్ షాక్‌తో మృతి చెందాయి. విద్యుత్ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా స్పందన లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ట్రాన్స్‌ఫార్మర్‌ను తక్షణమే తొలగించాలని వారు కోరుతున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.