కడుపునొప్పి బాధ తాళలేక వృద్ధురాలు ఉరివేసుకుని మృతి

2చూసినవారు
కడుపునొప్పి బాధ తాళలేక వృద్ధురాలు ఉరివేసుకుని మృతి
తూప్రాన్ పట్టణంలో తీవ్ర కడుపునొప్పితో బాధపడుతున్న 70 ఏళ్ల ఉప్పు వీరమ్మ అనే వృద్ధురాలు మనోవేదనకు గురై ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఆమె చాలాకాలంగా అనారోగ్య సమస్యలతో, ముఖ్యంగా కడుపునొప్పితో ఇబ్బంది పడుతున్నారని, రాత్రి తన నివాసంలో ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నారని తూప్రాన్ ఎస్ఐ గంగరాజు వెల్లడించారు. మృతురాలి కుమారుడు సంతోష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్