
తెలంగాణలో రాబోయే మూడు రోజుల పాటు వర్షాలు
తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో అకాల వర్షాలు కురుస్తున్నాయి. ఛత్తీస్‌గఢ్‌ను ఆనుకుని ఉన్న తూర్పు విదర్భపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఇప్పుడు మధ్యప్రదేశ్‌లో కేంద్రీకృతమై ఉండటంతో.. రాబోయే 2-3 రోజుల్లో నైరుతి రుతుపవనాలు మరిన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. సోమ, మంగళ, బుధవారాల్లో రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులు, 40-50 కి.మీ వేగంతో ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది.




