మెదక్ జిల్లా నర్సాపూర్ ఆది లక్ష్మీనారాయణ ఆలయంలో వైకుంట ఏకాదశి సందర్బంగా ఉత్తర ద్వారం నుండి ఆది లక్ష్మీ నారాయణ స్వామిని శుక్రవారం నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ దుర్గప్పగారి అశోక్ గౌడ్ దంపతులు దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా నర్సాపూర్ ప్రజలు పెద్ద ఎత్తున ఆలయంలో పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.