నర్సాపూర్ పరిధిలోని హన్మంతాపూర్‌లో ఇంటి వద్ద ఉన్న మందుల నగేష్ (చరణ్)పై వీధి కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. ఈ ఘటనతో స్థానికులు ఆందోళన చెందారు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు, స్థానికులు వెంటనే ఆయనను నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.