నర్సాపూర్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని నియోజకవర్గ ఇంచార్జ్ ఆవుల రాజిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మున్సిపాలిటీ పరిధిలోని 14, 15 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థుల తరపున నిర్వహించిన ప్రచారంలో ఆయన మాట్లాడుతూ, బీఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు ఇవ్వడంలో విఫలమైందని విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో అర్హులైన ప్రతి నిరుపేదకు ఇందిరమ్మ ఇళ్లు అందిస్తామని హామీ ఇచ్చారు.