పిడుగుపాటుకు మహిళ మృతి

846చూసినవారు
పిడుగుపాటుకు మహిళ మృతి
నర్సాపూర్ మండలంలోని తిర్మలాపూర్ గ్రామానికి చెందిన సరిత (29) అనే మహిళ ఆదివారం పిడుగుపాటుకు గురై అక్కడికక్కడే మృతి చెందింది. మల్లేష్, సరిత దంపతులకు పదేళ్ల కుమారుడు శ్రవణ్ ఉన్నాడు. వ్యవసాయం, పాడి పశువులతో కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. మల్లేష్ మొదటి భార్య పాముకాటుతో మృతి చెందగా, సరితను రెండో వివాహం చేసుకున్నాడు. పశువులను మేతకు తీసుకెళ్లిన సమయంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఈ క్రమంలో సరితపై పిడుగు పడటంతో ఆమె మరణించింది. మల్లేష్ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్