8 గంటల పని హక్కు కోసం కార్మికుల పోరాటం కొనసాగాలి

0చూసినవారు
కొల్చారం: మే డే సందర్భంగా సీఐటీయూ నాయకురాలు నరసమ్మ మాట్లాడుతూ, చికాగో కార్మికుల పోరాటాల ఫలితంగానే 8 గంటల పని విధానం సాధ్యమైందని తెలిపారు. ప్రస్తుతం కార్పొరేట్ సంస్థలు కొత్త రూపంలో కార్మికులను దోపిడీ చేస్తున్నాయని, కనీస వేతనం, ఉద్యోగ భద్రత లేక కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హక్కుల సాధన కోసం కార్మికులంతా ఐక్యంగా ముందుకు రావాలని ఆమె పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్