తూప్రాన్ మండలంలోని మల్కాపూర్ గ్రామంలో గురువారం సాయంత్రం విషాదం చోటుచేసుకుంది. యువ రైతు కొంతం మణికాంత్ (23) తన వ్యవసాయ పొలం వద్ద విద్యుత్ సరఫరాను పరిశీలిస్తుండగా విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.