గుమ్మడిదల సమీపంలోని అటవీ ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతు ముగ్గురు మృతి చెందిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. నర్సాపూర్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న కారు ఎదురుగా వస్తున్న ఆటోను మేడాలమ్మ దేవాలయం వద్ద ఢీకొంది. ఆటోలో ఉన్న ఐశ్వర్య, మనిషా తో పాటు మరొకరు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన మరో నలుగురిని నర్సాపూర్ ప్రాంతీయ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.