సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ వద్ద జాతీయ రహదారిపై శనివారం రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి. యూ-టర్న్ తీసుకుంటున్న ఎలక్ట్రికల్ బస్సును సంగారెడ్డి డిపో బస్సు ఢీకొట్టడంతో రెండు బస్సుల అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. అదృష్టవశాత్తూ ప్రయాణికులకు ఎటువంటి గాయాలు కాలేదు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.