జిల్లా పోలీస్ కార్యాలయంలో బ్యాంకు, గోల్డ్ లోన్ సంస్థల మేనేజర్లతో ఎస్పీ డి.వి. శ్రీనివాస్ రావు భద్రతపై అవగాహన సమావేశం నిర్వహించారు. అనుమానాస్పద కార్యకలాపాలపై వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, బ్యాంకుల్లో భద్రతా ప్రమాణాలు బలోపేతం చేయాలని ఆయన సూచించారు. సీసీటీవీ కెమెరాలు, ఆటోమేటిక్ అలారం సిస్టమ్స్, యాక్సెస్ కంట్రోల్ వంటి ఆధునిక భద్రతా ఏర్పాట్లు తప్పనిసరిగా అమలు చేయాలని తెలిపారు. ఈ సమావేశం నేరాల నివారణకు, ప్రజల ఆస్తుల రక్షణకు దోహదపడుతుందని భావిస్తున్నారు.