రామాయంపేట మండలం - Ramayampeta Mandal

మెదక్ జిల్లా
అర్ష్‌దీప్‌కు అవకాశం ఇవ్వండి: అశ్విన్
Jan 16, 2026, 11:01 IST/

అర్ష్‌దీప్‌కు అవకాశం ఇవ్వండి: అశ్విన్

Jan 16, 2026, 11:01 IST
రాజ్‌కోట్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డేలో టీమిండియా ఓటమి పాలైంది. ఈ నేపథ్యంలో, భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, ఫామ్‌లో ఉన్నప్పటికీ తుది జట్టులో చోటు దక్కని స్టార్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌కు కనీసం మూడో వన్డేలోనైనా అవకాశం ఇవ్వాలని హెడ్‌కోచ్ గౌతమ్ గంభీర్‌ను సూచించారు. తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడుతూ, అశ్విన్, బౌలర్ల మధ్య పోటీని అర్థం చేసుకోగలనని, అయితే అర్ష్‌దీప్ కష్టపడి జట్టు విజయాల్లో భాగమయ్యాడని, అయినప్పటికీ స్థానం కోసం పోరాడుతున్నాడని, బ్యాటర్లతో పోలిస్తే బౌలర్లే ఎక్కువగా బలి అవుతున్నారని, ఎక్కువ కాలం బెంచ్‌పై కూర్చోబెడితే రిథమ్‌ను కోల్పోతారని పేర్కొన్నారు.