కాంగ్రెస్ పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా కౌన్సిలర్ ఎన్నికల్లో పనిచేస్తున్న ముగ్గురు నాయకులను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు సమన్వయ కమిటీ సభ్యులు తోపాజి అనంత కిషన్, రఘుగౌడ్, బొంగుల రవి బుధవారం తెలిపారు. సునీల్ జై కుమార్, నాగరాజు, మరియు ఒక యువజన కాంగ్రెస్ నాయకుడిని పార్టీ నుంచి బహిష్కరించినట్లు వారు పేర్కొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థులకు వ్యతిరేకంగా పనిచేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.