
జహీరాబాద్: ప్రభుత్వ పాఠశాలకు 1. 40 కోట్ల నిధులు
సంగారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న స్కావెంజర్ల వేతనాల కోసం జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు బుధవారం రూ. 1.40 కోట్ల నిధులను విడుదల చేశారు. ఈ నిధులు 1210 పాఠశాలల్లో పనిచేసే స్కావెంజర్లకు జూలై, ఆగస్టు నెలల వేతనాల కోసం కేటాయించారు. ఈ మొత్తాన్ని నేరుగా అమ్మ ఆదర్శ పాఠశాల ఖాతాలో జమ చేసినట్లు ఆయన తెలిపారు.




































