
సంగారెడ్డి: అదుపు తప్పి టిప్పర్ బోల్తా
శుక్రవారం రాత్రి 12 గంటల సమయంలో చౌటకూర్ మండల పరిధిలోని సర్వేపల్లి గ్రామం సమీపంలో ఇసుక లోడుతో వెళ్తున్న టిప్పర్ అదుపు తప్పి ఫ్లైఓవర్ నుంచి సర్వీస్ రోడ్డుకు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు అధిక వేగం, వాహన నియంత్రణ కోల్పోవడమే ప్రమాదానికి కారణమని తెలిపారు. ఫ్లైఓవర్ భద్రత, వాహనాల వేగ నియంత్రణ, రోడ్డు నిర్మాణ నాణ్యతపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. రహదారి పక్కన నిల్వలు ఉంచకూడదని, జాగ్రత్తగా నడపాలని డ్రైవర్లకు సూచించారు.




































