Apr 20, 2026, 10:04 IST/
కుమార్తెను చంపి అడవిలో పడేసిన తండ్రి
Apr 20, 2026, 10:04 IST
ఉత్తరప్రదేశ్లోని బారాబంకీలో పరువు హత్య కలకలం రేపింది. వినయ్ చౌబే అనే తండ్రి తన 26 ఏళ్ల కుమార్తెను గొంతు నులిమి హత్య చేసి, మృతదేహాన్ని అడవిలో పడేశాడు. కుమార్తె ముఖాన్ని గుర్తుపట్టలేనంతగా వికృతం చేయడానికి కూడా ప్రయత్నించాడు. కుటుంబ పరువును కాపాడటానికే ఈ హత్య చేసినట్లు నిందితుడు వినయ్ నేరం అంగీకరించాడు. పోలీసులు అతన్ని అరెస్టు చేసి జైలుకు తరలించారు.