చేర్యాల: రోడ్డు ప్రమాదంలో విద్యార్థిని మృతి

1470చూసినవారు
చేర్యాల: రోడ్డు ప్రమాదంలో విద్యార్థిని మృతి
గురువారం సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన 18 ఏళ్ల ఇంటర్ విద్యార్థిని కీర్తన చికిత్స పొందుతూ మృతి చెందింది. ఆకునూర్ గ్రామానికి చెందిన కీర్తన, పాత బస్టాండ్ వద్ద జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడటంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

సంబంధిత పోస్ట్