కందిలో ట్రాక్టర్ బోల్తా: ముగ్గురికి తీవ్ర గాయాలు

1389చూసినవారు
కందిలో ట్రాక్టర్ బోల్తా: ముగ్గురికి తీవ్ర గాయాలు
సంగారెడ్డి జిల్లా, ప‌టాన్‌చెరు నియోజకవర్గం, కంది గ్రామంలోని క్లియర్ కంపెనీ వద్ద ఆదివారం మధ్యాహ్నం ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో మహేష్ (30), సరిత (28), లక్ష్మయ్ (55) అనే ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారంతో వెంటనే స్పందించిన కంది 108 సిబ్బంది EMT చిరంజీవి, పైలట్ జగదీష్ లు క్షతగాత్రులకు ప్రథమ చికిత్స అందించి సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సకాలంలో స్పందించిన 108 సిబ్బందిని పలువురు అభినందించారు. కుటుంబ సభ్యులు వారికి కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్