సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ నియోజకవర్గంలో ఇద్దరు మహిళలు అదృశ్యమైన ఘటనలు కలకలం రేపాయి. టీచర్స్ కాలనీకి చెందిన జాయిసి (24) మార్చి 28న స్కూల్‌కు వెళ్లి తిరిగి రాలేదు. వెంకటరమణ కాలనీకి చెందిన కవిత (29) మార్చి 27 రాత్రి ఇంటి నుంచి వెళ్లిపోయి కనిపించలేదు. ఈ ఘటనలపై కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదు కాగా, ఎస్సై కె. వినయ్ కుమార్ దర్యాప్తు చేస్తున్నారు.