జహీరాబాద్: దొంగతనం కేసు ఛేదించిన పోలీసులు

1101చూసినవారు
జహీరాబాద్: దొంగతనం కేసు ఛేదించిన పోలీసులు
గత నెల 27న న్యాల్కల్ మండలంలోని ఖలీల్ పూర్ గ్రామంలో జైపాల్ రెడ్డి, మారప్ప ఇళ్లలో పట్టపగలే దొంగతనం జరిగిన కేసును పోలీసులు ఛేదించారు. ఆదివారం గంగ్వార్ క్రాస్ రోడ్ వద్ద హద్నూర్ ఎస్సై దోమ సుజిత్ తన సిబ్బందితో కలిసి నిందితుడిని పట్టుకున్నారు. విచారణలో నిందితుడు దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నాడు. నిందితుడి వద్ద రెండున్నర తులాల బంగారం, 1000 రూపాయల నగదు లభించాయి. దొంగతనానికి ఉపయోగించిన ఆటోను స్వాధీనం చేసుకుని, నిందితుడిని రిమాండ్ కు తరలించారు. మూడు రోజుల్లోనే కేసును ఛేదించిన ఎస్సై దోమ సుజిత్ ను సీఐ జక్కుల హనుమంతు అభినందించారు.