మేడారం జాతర.. పిల్లల భద్రతకు ఆర్టీసీ ప్రత్యేక చర్యలు

1చూసినవారు
మేడారం జాతర.. పిల్లల భద్రతకు ఆర్టీసీ ప్రత్యేక చర్యలు
TG: మేడారం మహా జాతరకు వెళ్లే భక్తుల పిల్లల భద్రత కోసం ఉప్పల్ బస్టాండ్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్టాప్ వద్ద వీఐ సురక్షిత కేంద్రాన్ని ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వై. నాగిరెడ్డి పరిశీలించారు. పిల్లలకు గుర్తింపు ట్యాగ్‌లు (wristbands) వేస్తున్న విధానాన్ని పరిశీలించి, స్వయంగా పిల్లలకు ట్యాగ్‌లు వేశారు. మేడారం వెళ్లే సమయంలో పిల్లలు తప్పిపోకుండా ఉండేందుకు ఈ చర్యలు ఉపయోగపడతాయని ఆయన పేర్కొన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు పటిష్టంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్