TG: మేడారం మహా జాతర సందర్భంగా ఈ నెల 30, 31న రాష్ట్రవ్యాప్తంగా అధికారిక సెలవులు ప్రకటించాలని విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర ధర్మాచార్య సంపర్క్ ప్రముఖ్ బాలస్వామి డిమాండ్ చేశారు. మేడారంలో క్యాబినెట్ భేటీ నిర్వహించిన సీఎం రేవంత్ సెలవులపై ఎందుకు ప్రకటన చేయడం లేదని ప్రశ్నించారు. ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతర అని చెప్పుకుంటున్న సర్కార్ వేడుకలకు తగిన గుర్తింపు ఇవ్వడంలేదని విమర్శించారు. వెంటనే సెలవులపై ప్రకటన చేయాలని కోరారు.