
మహేశ్ బాబు - రాజమౌళి మధ్య SSMB29 అప్డేట్ పై ట్విట్టర్ వార్ !
మహేశ్ బాబు - దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళిల #SSMB29 సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నవంబర్లో అప్డేట్ ఇస్తామని రాజమౌళి గతంలో ప్రకటించారు. ఈ నేపథ్యంలో మహేశ్ బాబు నవంబర్ రావడంపై ట్వీట్ చేయగా రాజమౌళి సరదాగా స్పందించారు. వీరిద్దరి మధ్య ట్వీట్ల రూపంలో జరిగిన సంభాషణలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా స్పందించారు. రాజమౌళి సినిమా అప్డేట్లను ఒక్కొక్కటిగా వెల్లడిస్తామని హామీ ఇచ్చారు.




