మెడికల్ పరీక్షల తేదీలు ఖరారు

9622చూసినవారు
మెడికల్ పరీక్షల తేదీలు ఖరారు
నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (ఎన్ బీఈఎంఎస్) 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన మెడికల్ పరీక్షల తాత్కాలిక తేదీలను విడుదల చేసింది. ఆగస్టు 30న నీట్ పీజీ, డిసెంబర్ 11, 12 తేదీల్లో నీట్ ఎస్ఎస్, జనవరి 9, 2027న ఎఫ్ఎంజీఈ డిసెంబర్ సెషన్ పరీక్షలు జరగనున్నాయి. డీఎన్బీ, ఎన్ బీఈఎంఎస్ డిప్లొమా పరీక్షల తేదీలను కూడా ప్రకటించారు. అయితే, ఈ తేదీలు తాత్కాలికమేనని, పరిస్థితులను బట్టి మార్పులు ఉండవచ్చని బోర్డు తెలిపింది. పూర్తి వివరాలకు natboard.edu.in ను సందర్శించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్