
101 ఏళ్ల జపాన్ మాజీ ప్రధాని కన్నుమూత
జపాన్ సోషలిస్టు పార్టీ నేత, మాజీ ప్రధాని తొమిచి మురయమ (101) శుక్రవారం ఓయిటా సిటీలో తుదిశ్వాస విడిచారు. 1994, జూన్ 29న జపాన్ 81వ ప్రధానిగా మురియమ బాధ్యతలు స్వీకరించారు. రెండో ప్రపంచ యుద్ధానికి 50 ఏళ్లు ముగిసిన సందర్భంగా 1995లో యురయమ ఓ ప్రకటన చేశారు. తప్పుడు జాతీయ విధానాలు, జపాన్ యుద్ధ కాంక్ష వల్ల అనేక దేశాలు, ముఖ్యంగా ఆసియా దేశాలు తీవ్రంగా నష్టపోయాయని ప్రకటించారు. 2000లో రాజకీయాల నుంచి విరమించుకున్నారు.




