బెంగళూరులో కాలేజ్ వేధింపుల కారణంగా ఓ వైద్య విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. ఆనేకల్ తాలూకా చందాపుర సమీపంలో 23 ఏళ్ల యశస్విని మృతిచెందింది. ఆమె బొమ్మనహళ్లిలోని ఆక్స్‌ఫర్డ్ డెంటల్ కాలేజ్‌లో రేడియాలజీ మూడో సంవత్సరం చదువుతోంది. అనారోగ్యంతో ఒక రోజు కాలేజ్‌కు రాకపోవడంతో లెక్చరర్ తరగతిలోనే అవమానించారని కుటుంబం ఆరోపించింది. దీనివల్ల తీవ్ర మానసిక ఒత్తిడికి లోనైన యశస్విని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. ఘటనపై విద్యార్థులు ఆందోళన చేపట్టగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.