
బాల్ ఆధార్ అప్డేట్ ఉచితం.. చిన్నారుల బయోమెట్రిక్స్ నమోదు తప్పనిసరి!
ఐదేళ్ల లోపు చిన్నారులకు ఇచ్చే 'బాల్ ఆధార్' వివరాలను ఉచితంగా నవీకరించుకునే ప్రక్రియపై యూఐడీఏఐ (UIDAI) కీలక సమాచారం అందించింది. పిల్లలకు 5 ఏళ్లు, 15 ఏళ్లు నిండినప్పుడు ఆధార్ కేంద్రానికి వెళ్లి బయోమెట్రిక్స్ నమోదు చేయించాలి. దీనికి ఎలాంటి రుసుము లేదు. ఆధార్ నిలిచిపోకుండా, పాఠశాల ప్రవేశాలు, ప్రభుత్వ పథకాలకు ఇబ్బంది లేకుండా తల్లిదండ్రులు వెంటనే అప్డేట్ చేయాలని సూచించింది.




