దుబాయ్‌లో జరిగిన సౌతిండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (SIIMA) వేడుకలో హీరోయిన్ మీనాక్షి చౌదరి సందడి చేసింది. తన అందం, హుందాతనంతో రెడ్ కార్పెట్‌పై నడుస్తూ అందరి చూపు తనవైపు తిప్పుకుంది. 'లక్కీ భాస్కర్' చిత్రంలో ఆమె అద్భుతమైన నటనకు ఉత్తమ నటి (క్రిటిక్స్) అవార్డు అందుకున్నారు. ఈ వేడుకలో వైట్ డిజైనర్ వేర్‌లో ఉన్న మీనాక్షి వీడియోలు, ఫొటోలు వైరలవుతున్నాయి.