
నేపాల్ వరదలు.. మరోసారి సోనూసూద్ ఔదార్యం
బాలీవుడ్ నటుడు సోనూ సూద్ నేపాల్ వరద బాధితులకు సహాయం అందించడానికి ఖాట్మండు చేరుకున్నారు. వరద బాధితులను కలిసి, వారికి సహాయక సామగ్రిని పంపిణీ చేశారు. వారు తిరిగి సాధారణ జీవితాన్ని గడిపేలా తమ వంతు సహాయం అందిస్తామని, రాబోయే నెలల్లో కూడా నేపాల్‌కు సహాయం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. గతంలో కోవిడ్ మహమ్మారి సమయంలో కూడా సోనూ సూద్ ఎంతోమందికి అండగా నిలిచారు.




