మీనాక్షి నటరాజన్ నామినేషన్ ఇటీవల తిరస్కరణకు గురైన విషయం తెలిసిందే. దీంతో
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షిని రాజ్యసభకు పంపేందుకు ఉన్న దారులను వెతుకుతోంది. తాజాగా తెలంగాణ నుంచి రాజ్యసభకు పంపే అవకాశాలను
కాంగ్రెస్ పరిశీలిస్తోంది. అయితే రాబోయే రెండేళ్ల వరకు ఇక్కడ ఖాళీలు లేవు. ప్రస్తుతం ఉన్న 4 ఎంపీల్లో ఒకరితో రాజీనామా చేయించి ఆ స్థానాన్ని మీనాక్షికి కేటాయించాలనే ప్రతిపాదనపై సీఎం రేవంత్ రాహుల్ గాంధీతో చర్చించినట్లు సమాచారం. ప్రస్తుతం రాష్ట్రం నుంచి రాజ్యసభ సభ్యులుగా అనిల్ యాదవ్, వేం నరేందర్ రెడ్డి, అభిషేక్ సింఘ్వీ, రేణుకా చౌదరి ఉన్నారు.