
ఓటు హక్కు కోల్పోయినా.. ఎమ్మెల్యేగా గెలిచాడు
పశ్చిమ బెంగాల్‌లోని ఫరక్కా నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి మొతాబ్ షేక్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఎన్నికల ముందు ఆయన పేరును ఓటర్ల జాబితా నుంచి తొలగించారు. దీనిపై ఆయన సుప్రీంకోర్టు నియమించిన ట్రైబ్యునల్‌ను ఆశ్రయించారు. నామినేషన్ల గడువు ముగియడానికి కొద్దిసేపటి ముందు ఓటు హక్కును పునరుద్ధరిస్తూ ట్రైబ్యునల్ తీర్పునిచ్చింది. దీంతో ఆయన ఫరక్కా స్థానంలో నామినేషన్ దాఖలు చేసి, బీజేపీ అభ్యర్థి సునీల్ చౌదరీపై 8 వేలకు పైగా ఓట్ల తేడాతో గెలుపొందారు.




