సంక్రాంతికి మెగా మ్యాజిక్.. అనిల్ రావిపూడి ధీమా

10679చూసినవారు
సంక్రాంతికి మెగా మ్యాజిక్.. అనిల్ రావిపూడి ధీమా
దర్శకుడు అనిల్ రావిపూడి తన రాబోయే చిత్రం 'మన శంకర వరప్రసాద్‌ గారు'పై భారీ అంచనాలను వ్యక్తం చేశారు. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానున్న ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా, విక్టరీ వెంకటేష్ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. తాజాగా డైరెక్టర్ అనిల్ మాట్లాడుతూ.. 'ఈసారి సంక్రాంతికి చిరంజీవితో ఒక అద్భుతమైన మ్యాజిక్ జరగబోతోందని అనుకుంటున్నాను. ఇందులో వెంకటేష్ స్పెషల్ క్యామియో చేయబోతున్నారు. చాలా బాగుంటుంది. ఈసారి సంక్రాంతికి ఆడియన్స్ కి ఫుల్ మజా వస్తది' అని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్