కుటుంబ సభ్యులతో కలిసి మెగాస్టార్ చిరంజీవి శుక్రవారం పుట్టిన రోజు వేడుకలను గోవాలో జరుపుకోనున్నారు. బేగంపేట్ నుంచి ప్రత్యేక విమానంలో కుటుంబ సభ్యులతో కలిసి గురువారం గోవా వెళ్లారు. కాగా.. మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిరంజీవి మూవీ ఫస్ట్ గ్లింప్స్, టైటిల్ రేపు ఉదయం విడుదల చేయబోతున్నారు.