
వర్కౌట్ చేస్తే లగ్జరీ గిఫ్ట్లు.. ఉద్యోగులకు కంపెనీ ఆఫర్
మారుతున్న జీవనశైలిలో వ్యాయామం తప్పనిసరి అని నిపుణులు చెబుతున్న నేపథ్యంలో, దక్షిణ కొరియాకు చెందిన ఓ కంపెనీ తమ ఉద్యోగులను ఫిట్నెస్ వైపు ప్రోత్సహించడానికి వినూత్న ఆలోచన చేసింది. క్రమం తప్పకుండా రెండు నెలల పాటు వ్యాయామం చేసే ఉద్యోగులకు గూచీ, షనెల్, ప్రాడా వంటి లగ్జరీ బ్రాండ్లకు చెందిన ఉత్పత్తులను కానుకగా ఇస్తోంది. ఈ విషయాన్ని ఆ కంపెనీలో పనిచేస్తున్న భారతీయ ఉద్యోగి మాన్సి ఆరోరా సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ వార్త వైరల్ అయింది.




