మెగాస్టార్ చిరంజీవి నటించిన 'వేట' టైటిల్‌తో కొత్త సినిమా సోమవారం పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ఈ చిత్రంలో సందీప్ సరోజ్, సాత్విక జంటగా నటిస్తున్నారు. ఈటీవీ విన్, ఎస్ఆర్‌డీ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాతో అశోక్ కోటిపల్లి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. గోదావరి నదీ గర్భం నుంచి వెలువడిన ఒక అజ్ఞాత గాథతో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రంలో కేఎస్ రవికుమా
ర్, రాజీవ్ కనకాల, రఘుబాబు, రవీంద్ర విజయ్, ప్రభావతి, ప్రమోదిని, వికాస్ వశిష్ట తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.