మలేరియా, టైఫాయిడ్ వంటివాటిలాగానే మానసిక అనారోగ్యం కూడా ఒక వ్యాధి. దానికి తగిన చికిత్స తీసుకోవాలన్న స్పృహ సమాజంలో పెరగాలి. అప్పుడే ఇలాంటి ఆత్మహత్యలు తగ్గుతాయి. కుటుంబ, ఆర్థిక సమస్యలు చాలామందికి ఉంటాయి. అలా ఉన్నవారంతా ఆత్మహత్యకు పాల్పడరు. వ్యసనాలకు గురైనవారంతా చనిపోవాలనుకోరు. స్వభావంలోనే సూసైడల్ టెండెన్సీ ఉన్నవారు, ఒత్తిడి, కుంగుబాటు వంటి మానసిక సమస్యలతో బాధపడేవారు.. చనిపోవడమే తమ సమస్యలకు పరిష్కారంగా భావిస్తారు.